Budameru River Flood: వీడియో ఇదిగో, విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, గండి పడకుండా పరివాహక గట్లకు మట్టి కట్టలు వేస్తున్న ప్రజలు
నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు.
విజయవాడను వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికి ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయి. పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. గండ్లను పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామానాయుడిని లోకేశ్ కోరారు. తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)