Andhra Pradesh: చెరువులు, కాలువల్లో చేపల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీకి మొదటి ర్యాంక్, 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ ప్రభుత్వం

ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్‌ వరుస స్థానాలు పొందాయి.

CM Jagan (Photo-Video Grab)

చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల్లో (ఇన్‌ల్యాండ్‌) చేపలను ఉత్పత్తి చేయడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇన్‌ల్యాండ్‌లో 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ మొదటి స్థా­నం­లో నిలవగా.. ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్‌ వరుస స్థానాలు పొందాయి.

కాగా, సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో 7.02 లక్షల ట­న్ను­లతో గుజరాత్‌ మొదటి స్థానం, 6.01 లక్షల ట­న్ను­లతో కేరళ రెండోస్థానం, 5.95 లక్షల టన్నులతో తమిళనాడు మూడో స్థానంలో ఉండగా.. 5.94 ల­క్షల టన్నులతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. చేపల ఉత్పత్తిలో 2021–22 సంవత్సరానికి సంబంధించి జాతీయ సగటు వృద్ధి రేటును పరిశీలిస్తే.. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 12.57 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది.

Here's YSRCP Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)