AP Coronavirus: ఏపీలో మళ్లీ పుంజుకున్న కరోనా, కొత్తగా 492 కేసులు, ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 168 కేసులు, అప్రమత్తం అయిన ప్రభుత్వం, వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన సమీక్ష
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 33,634 కరోనా పరీక్షలు నిర్వహించగా... 492 మందికి పాజిటివ్ (Andhra Pradesh) అని నిర్ధారణ అయింది. ఇక ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 168 కేసులు గుర్తించారు. జిల్లాలోని రాజమండ్రిలో ఓ కాలేజీలో 163 మంది కరోనా ( Covid-19 cases) బారినపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,616 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతోంది. 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’ అని తెలిపారు.
ఏపీ కరోనావైరస్ రిపోర్ట్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)