AP Covid Report: ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, తాజాగా 585 కేసులు నమోదు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 128 కేసులు, రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 585 కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో 99 కేసులతో గుంటూరు జిల్లా ఉండగా... 8 కేసులతో కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇదే సమయంలో చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,121కి పెరిగింది. ఇదే సమయంలో 8,84,978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,197 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

Here's AP Covid Report:

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement