AP Coronavirus: ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 7,244కి చేరుకున్న మరణాల సంఖ్య, ప్రస్తుతం 10,710కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,710కి చేరింది. గడచిన 24 గంటల్లో 30,678 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171, కృష్ణా జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయి.

Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

అత్పల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 911 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,244కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,09,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,91,048 మంది కోలుకున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement