AP Covid: కోవిడ్ కల్లోలం, ఏపీలో తాజాగా 7,224 మందికి కరోనా, చిత్తూరులో అత్యధికంగా 1051 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 96 కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం 35, 907 శాంపిల్స్ పరీక్షించగా రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదు కాగా, కోవిడ్ వైరస్ తో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. ఏపీలో 40,469 యాక్టివ్ కేసులు ఉండగా, 9,07,598 మంది రికవరీ అయ్యారు.
కరోనా వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కడప. విజయనగరం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడచిన 24 గంటల్లో 2,332 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1, 56, 42, 070 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.
తాజాగా 13 జిల్లాల్లో కేసులను ఓ సారి పరిశీలిస్తే.. అనంతపురంలో 420 కేసులు నమోదు కాగా చిత్తూరులో అత్యధికంగా 1051 కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ గోదావరిలో 906, గుంటూరులో 903, కపడలో 200, కృష్ణాలో 493, కర్నూలులో 507, నెల్లూరులో 624, ప్రకాశంలో 588, శ్రీకాకుళంలో 662, విజయనగరంలో 304, విశాఖపట్నంలో 470, వెస్ట్ గోదావరిలో 96 కేసులు నమోదయ్యాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement