Andhra Pradesh: సీఎం వైఎస్ జగన్‌తో ఆల్ ఇండియా ష్రింప్ హ్యచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం కాకుండా చూడాలని వినతి
కాకినాడ వద్ద ఏర్పాటుకానున్న మేజర్ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా, దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని, డ్రగ్ పార్క్ వ్యర్ధ జలాల డిశ్చార్జ్ పాయింట్ దూరం పెంచాలని సీఎంని హ్యచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
కాకినాడ వద్ద ఏర్పాటుకానున్న మేజర్ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా, దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని, డ్రగ్ పార్క్ వ్యర్ధ జలాల డిశ్చార్జ్ పాయింట్ దూరం పెంచాలని సీఎంని హ్యచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. దీంతోపాటు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సర్‌ప్లస్ పవర్‌ను హ్యచరీస్‌కు ప్రత్యేక కేటగిరి క్రింద ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ష్రింప్ హ్యచరీస్ అసోసియేషన్ సమస్యలపై సానుకూలంగా సీఎం సానుకూలంగా స్పందించారని వారు అన్నారు.
ఈ సందర్భంగా సీఎంని కలిసిన ఆర్‌అండ్‌బీ శాఖా మంత్రి దాడిశెట్టి రాజా, ఆల్ ఇండియా ష్రింప్ హ్యచరీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కొనకంటి మదుసూధన్ రెడ్డి, కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ సత్తి బుల్లి వీర్ రెడ్డి, నేషనల్ బాడీ వైస్ ప్రెసిడెంట్ వి. సత్తిరెడ్డి, అడ్వైజర్ ప్రత్తిపాటి వీరభద్ర కుమార్, హ్యచరీ ఓనర్స్ కనుమూరి ఆనంద వర్మ, ఎ.నగేష్ బాబు, బి.విజయ్‌కుమార్, సి. కోదండ.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)