Ragging in College Hostel: నరసరావుపేటలో కాలేజీలో ర్యాగింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్, ఘటనపై విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్‌ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎన్‌సీసీ ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు అర్థరాత్రి సమయంలో విచక్షణ రహితంగా చితకబాదారు. పదే పదే ఇలా చేస్తుండటంతో.. దెబ్బలు తట్టుకోక జూనియర్ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Senior students Ragging on junior students at midnight In the name of NCC training in SSN college Palnadu

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్‌ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎన్‌సీసీ ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు అర్థరాత్రి సమయంలో విచక్షణ రహితంగా చితకబాదారు. పదే పదే ఇలా చేస్తుండటంతో.. దెబ్బలు తట్టుకోక జూనియర్ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఈ ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులను విచారిస్తున్నారు. నరసరావుపేట వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డి విద్యార్థులను విచారించి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. వాస్తవానికి ఈ ర్యాగింగ్ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండతో ఘటన వైరల్ అయింది. ర్యాగింగ్‌ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now