Murder for Camera: విశాఖలో దారుణం, రూ. 15 లక్షల కెమెరా కోసం యువకుడిని కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు
విశాఖపట్నంకు చెందిన 23 ఏళ్ల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని రూ. 15 లక్షల కెమెరా కోసం ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఫోటో షూట్ సాకుతో బాధితుడు పి.సాయి కుమార్‌ను కోనసీమ జిల్లాకు పిలిపించి నిందితులు అతడిని హత్య చేసి కెమెరా, ఇతర సామగ్రిని దోచుకెళ్లారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఏపీలోని విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన 23 ఏళ్ల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని రూ. 15 లక్షల కెమెరా కోసం ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఫోటో షూట్ సాకుతో బాధితుడు పి.సాయి కుమార్‌ను కోనసీమ జిల్లాకు పిలిపించి నిందితులు అతడిని హత్య చేసి కెమెరా, ఇతర సామగ్రిని దోచుకెళ్లారు. పథకం ప్రకారం సాయిని తేజ, వినోద్‌కుమార్‌లు హత్య చేసి మృతదేహాన్ని అదే రోజు అర్ధరాత్రి 216ఎ జాతీయ రహదారిపై ఉన్న జొన్నాడ గ్రామం వరకూ వచ్చి.. అక్కడి గౌతమీ గోదావరి తీరంలో పూడ్చివేశారు.
మూడు రోజులైనా సాయి ఇంటికి రాకపోవడం, అతడి ఫోన్, తేజ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో సాయి తల్లిదండ్రులు గత నెల 29న విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి కారు యజమానిని ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారంటూ హిజ్రాలను చితకబాదిన కాలనీవాసులు, వీడియోలు ఇవిగో..
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)