Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఘోర విషాదం, పూడిక తీస్తుండగా కరెంట్ షాక్, నలుగురు అక్కడికక్కడే మృతి, పెదకాకానిలో అలుముకున్న విషాద ఛాయలు
గుంటూరు జిల్లా పెదకాకానిలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదకాకానిలోని నంబూరు కాళీ గార్డెన్స్ వెళ్లే మార్గంలో ఉన్న గోశాలలో కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. కాగా గోశాల వృథా నీటిని పక్కనే ఉన్న మూడు సంపుల్లో చేరేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు
గుంటూరు జిల్లా పెదకాకానిలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదకాకానిలోని నంబూరు కాళీ గార్డెన్స్ వెళ్లే మార్గంలో ఉన్న గోశాలలో కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. కాగా గోశాల వృథా నీటిని పక్కనే ఉన్న మూడు సంపుల్లో చేరేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే సంపులో చెత్త పేరుకుపోవడంతో నీరు లోపలకు వెళ్లలేదు. దీంతో అక్కడే పనిచేస్తున్న ఏకుల రాజేష్, యాదగిరి బాలయ్య, గంధాల మహంకాళి రావు.. పూడిక తీసేందుకు సంపులోకి మోటర్ తీసుకుని దిగారు.
అయితే మోటర్‌కి ఉన్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు వారికి తగలడంతో ముగ్గురూ కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. సూపర్‌వైజర్ శివరామ కాళీబాబు వారిని కాపాడేందుకు ప్రయత్నంచాడు. అయితే, ఆయనకూ కరెంట్ షాక్ తగలడంతో ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పెదకాకాని సీఐ నారాయణస్వామి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Four people died due to electrocution in Pedakakani
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)