Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె, సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా డాక్టర్

విజయవాడలోని అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి ఈ దృశ్యాన్ని చూసి వెంటనే అక్కడికి వెళ్లి బాలుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Six-year-old boy Heart stopped due to electric shock, doctor saved his life by performing CPR in Vijayawada

విజయవాడలో ఓ బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురై గుండె ఆగిన క్రమంలో సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు మహిళా డాక్టర్‌. వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్‌లో సాయి అనే ఆరేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.  దాంతో ఆ బాలుడి గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్‌ రవళి ఆ ఘటనను చూశారు.  వైరల్ వీడియో ఇదిగో, అపస్మారక స్థితిలోకి వెళ్లిన పామును సీపీఆర్ ద్వారా రక్షించిన పోలీస్, పాము తలను నోట్లో పెట్టుకుని గాలి ఊది సాహసం

ఆ బాలుడి పరిస్థితిని గమనించిన ఆమె..  ఉన్నపళంగా సీపీఆర్‌ చేశారు.  కొన్ని నిమిషాల పాటు సీపీఆర్‌ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్‌ చేసిన పెద్ద సాయానికి, ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now