Andhra Pradesh: వీడియో ఇదిగో, నూజివీడులో పట్టపగలే వైసీపీ నేతపై కత్తులతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో..
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నూజివీడులో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నూజివీడులో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతపై కత్తులతో దాడి చేశారు. నూజివీడు టౌన్ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్‌లో కత్తులతో వైఎస్సార్‌సీపీ నేత మీద దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ నడకుదుటి గిరీష్‌పై దాడి చేశారు.ఈ ఘటనలో గిరీష్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)