Andhra Pradesh: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ ఇంటిపై కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన ప్రత్యేక బలగాలు
విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైటీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు.
విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైటీడీపీ శ్రేణులు దాడి చేశాయి. వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ టీడీపీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. వీడియోలు ఇవిగో, వైసీపీ నేతల ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో టీడీపీ శ్రేణులు దాడులు, అడ్డువచ్చినా పోలీసు వాహనాలను సైతం..
సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ శ్రేణులు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)