Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌తో టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ భేటీ, రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టాలని కోరిన ముఖ్యమంత్రి

అనంతరం సీఎం జగన్ కూడా మర్యాదపూర్వకంగా గుర్నానీని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.

Tech Mahindra CEO MD Gurnani Meets CM YS Jagan in Camp Office (Photo-AP CMO/Twitter)

టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన గుర్నానీ సీఎం జగన్ ను సత్కరించి జ్ఞాపిక అందించారు. అనంతరం సీఎం జగన్ కూడా మర్యాదపూర్వకంగా గుర్నానీని సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.  టెక్ మహీంద్రా ఎండీ గుర్నానీ గత మే నెలలో సీఎం జగన్ ను దావోస్ లో కలిశారు.

ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు సీఎం జగన్ ఆ సమయంలో దావోస్ లో ఉన్నారు. అక్కడ సీఎం జగన్, గుర్నానీ మధ్య ఆసక్తికర రీతిలో చర్చలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులకు అనువైన విధానాలు అమలు చేస్తున్నామని, టెక్ మహీంద్రా కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం జగన్ కోరారు. ఏపీలో పరిశ్రమలు, సంస్థలు స్థాపించేవారి కోసం సింగిల్ విండో అనుమతులు ఉన్నాయని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)