Andhra Pradesh Shocker: గుండెలు పగిలే విషాదకర ఘటన. పాడె మోస్తూ విద్యుత్ షాక్‌తో ముగ్గురి మృతి, కుప్పంలో అంతిమయాత్రకు వచ్చి అనంతలోకాలకు..

చిత్తూరు జిల్లాలో అంతిమయాత్రకు వచ్చిన వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగాని పల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది

Representative Photo (Photo Credit: PTI)

చిత్తూరు జిల్లాలో అంతిమయాత్రకు వచ్చిన వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని తంబిగాని పల్లెకు చెందిన రాణి (65) అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు అంతిమ యాత్ర చేపట్టారు.

శ్మశానం వద్ద విద్యుత్ తీగలు కిందకు ఉండడంతో పాడె మోస్తున్న నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన తిరుపతి, మునెప్ప, గుంటూరుకు చెందిన రవీంద్రన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Representational image (Photo Credit- Pixabay)

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement