Andhra Pradesh: విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం, ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు, మరో ముగ్గురు ప్రాణాలతో బయటకు
విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
విశాఖ భీమిలి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు సముద్రంలోకి దిగగా.. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.తగరపువలసలో ఇంజనీరింగ్ చదువుతున్న ఈసీఈ బ్రాంచ్‌కు చెందిన సాయి, సూర్య గల్లంతైనట్టు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాప్టర్లతోనూ గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)