Andhra Pradesh: వాల్మీకి/ బోయ,బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు
విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.
ఏపీలోని వాల్మీకి/ బోయ, బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. శామ్యూల్ ఆనంద్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మూడు నెలల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది వాల్మీకి, బోయలు ఉన్నట్లు అంచనా.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)