YS Jagan Swearing Video: వీడియో ఇదిగో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలోకి చంద్రబాబు

రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు.

YS Jagan Mohan Reddy takes oath as a member of the House, in Amaravati Watch Video

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ (వీడియోలతో)

అనంతరం సభ నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సభ్యులందరూ దైవసాక్షిగానే ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు. తొలుత చంద్రబాబునాయుడు తర్వాత జనసేన చీఫ్, డిప్యూట్ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేశ్, ఎన్ఎండీ ఫరూఖ్, బీసీ జనార్దన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎస్. సవిత, డోలా బాలవీరాంజనేయస్వామి, శ్రీనివాస్ కొండపల్లి, వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు