Vijaya Sai Reddy: జూమ్‌లోనే మ్యూట్ చేసి పారిపోయావ్, డైరెక్ట్‌గా వస్తే తట్టుకోగలవా లోకేశం, ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరిన విజయసాయి రెడ్డి
విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జూమ్ మీటింగ్‌లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్.. ఇక డైరెక్ట్‌గా వస్తే తట్టుకోగలవా లోకేశం? అంటూ ఆయన లోకేశ్‌ను ప్రశ్నించారు. 'చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా..' అన్నారు విజయసాయి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
టెన్త్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంటరైన వ్యవహారంపై టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో విద్యార్థుల ఐడీలతో తన జూమ్ మీటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడిన లోకేశ్... దమ్ముంటే నేరుగా తనతో చర్చకు రావాలంటూ సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
నారా లోకేశ్ సంధించిన ఈ సవాల్‌కు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జూమ్ మీటింగ్‌లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్.. ఇక డైరెక్ట్‌గా వస్తే తట్టుకోగలవా లోకేశం? అంటూ ఆయన లోకేశ్‌ను ప్రశ్నించారు. 'చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా..' అన్నారు విజయసాయి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)