Pawan Kalyan: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది. మేం కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్టే. మమ్మల్ని అగౌరవ పరిచేలా మాట్లాడినా కలిసే ఉంటాం. గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని పార్టీ ఈ సభలోకి రాకూడదు’’ అని అన్నారు.
వైసీపీ నేతల విధ్వంసం చూస్తే.. వివేకా హత్య గుర్తొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ మాట్లాడారు. ‘‘వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదంగా మారిపోయారన్నారు. తెలంగాణ వాళ్లకి 'నా తెలంగాణ' అనే భావం ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)