AP Assembly: జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి.. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చెయ్యాలని ఆదేశం

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Election Commission of India. (Photo Credit: Twitter)

Vijayawada, Dec 22: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) సహా అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగబోతున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారుల బదిలీలపై కీలక సూచనలు చేసింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. పోలీసులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ  ఈ నియమాలు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుందని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తావించింది.

South Central Railway: పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్‌ న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలు ఇదిగో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)