AP Cabinet Meeting Postponed: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. కారణం ఏమిటంటే?
నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
Vijayawada, Nov 18: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting Postponed) వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో కేబినెట్ మీటింగ్ వాయిదా పడినట్టు తెలుస్తున్నది. కాగా, ఏపీ సీఎం సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని తిరుపతి తీసుకొచ్చారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో జరిగాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)