Minister Ponnam Prabhakar release Telangana electric vehicle New policy(X)

Hyderabad, Nov 18: తెలంగాణలో (Telangana) విద్యుత్తు వాహనాలకు సంబంధించి నూతన ఈవీ పాలసీని (New EV Policy in Telangana) తీసుకొచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ నేటి (నవంబరు 18) నుంచే అమల్లోకి వచ్చింది. తాజా ఈవీ పాలసీ ప్రకారం... ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉండనుంది. అంతేకాకుండా... వీటికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు ఇస్తారు. ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుంది.

ఢిల్లీలో తారాస్థాయికి చేరిన కాలుష్యం, అన్ని స్కూళ్లు మూసివేత‌, సోమ‌వారం నుంచి తీవ్ర‌మైన ఆంక్ష‌లు..

ఎందుకు తీసుకొచ్చారు?

పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకే ఈ కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తెలిపారు. ఢిల్లీ తరహాలో వాయు కాలుష్యం పరిస్థితులు హైదరాబాదులో ఏర్పడకూడదన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ ఆధారిత వాహనాలు ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని అన్నారు.

నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ గౌరవం అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నిలిచిన మోదీ