AP CID Ex Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

AP CID Ex-Chief Sanjay Faces Disciplinary Action Orders from CS Vijayanand(X)

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారం, నిధుల దుర్వినియోగం చేశారని సంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ట్యాబ్‌ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి.

అగ్ని మొబైల్‌ యాప్‌ను జేబు సంస్థలకు కట్టబెట్టారని సంజయ్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలపై నెల లోపు వివరణ ఇవ్వాలని సంజయ్‌ని ఆదేశించింది ప్రభుత్వం.

మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఏపీలో మొత్తం 81 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.  ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు విడుదల, మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ నిర్వహణ

AP CID Ex-Chief Sanjay Faces Disciplinary Action

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement