Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం, ఒక్కో ఎమ్మెల్యే ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశాలు

గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు.

YSRCPS MLAs (Photo/AP CMO Twitter)

గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్‌ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని సీఎం ప్రకటించారు. 10 రోజుల్లోపు గడప గడప చేసిన వారి పేర్లు సీఎం జగన్‌ చదివి వినిపించారు.

ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చాం

ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు

మీరు (ఎమ్మెల్యేలు) చేయాల్సిందల్లా గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే

గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి

వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు– గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి

కమిట్‌మెంట్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి

గడప,గడపకూ కార్యక్రమాన్ని మానిటర్‌ చేయాలన్న సీఎం

ఇందు కోసం 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం ఆదేశం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now