Tirupati Stampede: వీడియో ఇదిగో, తప్పు జరిగింది ప్రజలంతా మా ప్రభుత్వాన్ని క్షమించండి, తిరుపతి తొక్కిసలాట ఘటనపై క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan (photo-X)

తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో తప్పు జరిగింది మా ప్రభుత్వంలో కాబట్టి క్షమాపణ కోరుతున్నాం. TTDలో ప్రక్షాళన జరగాలి. TTD EO Additional EO విఫలమయ్యారు. శ్యామల రావు వెంకయ్య చౌదరి మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. ఈ ఘటనను బాధ్యతగా తీసుకోవాలని.. వారిద్దరికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సూచించారు. అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి తొక్కిసలాట ఘటన, ఇద్దరు అధికారులు సస్పెండ్, గాయపడిన వారికి రేపు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపిన చంద్రబాబు

టీటీడీలో ప్రక్షాళన జరగాల్సి ఉందన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి.. క్షమాపణ చెప్పాలని టీటీడీ పాలకమండలిలోని సభ్యులకు పవన్‌ కల్యాణ్ సూచించారు. తిరుపతిలో తప్పు జరిగింది క్షమించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

Pawan Kalyan apologized to the people 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now