Chandrababu naidu (Photo-X/TDP)

Tirumala, Jan 9: తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘‘డీఎస్పీ రమణ కుమార్‌ బాధ్యత లేకుండా పనిచేశారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణకుమార్‌, గోశాల డైరెక్టర్‌ హరనాథరెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నాం. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు.

తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులపై తీవ్ర ఆగ్రహం, వీడియో ఇదిగో..

మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున టీటీడీ ద్వారా ఆర్థిక సాయం అందిస్తాం. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి రూ.5లక్షల చొప్పున సాయం చేస్తాం. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2లక్షల పరిహారం అందిస్తాం.

CM Chandrababu Press Meet on Tirupati Stampede

బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉంది. 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చంద్రబాబు తెలిపారు.