తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. ‘‘ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం అంబులెన్స్‌ల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. చంద్రబాబు వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు.
CM Chandrababu Naidu inspects the spot where a stampede occurred last night in Tirupati
#WATCH | Andhra Pradesh CM N. Chandrababu Naidu inspects the spot where a stampede occurred last night in Tirupati, claiming the lives of 6 people and injuring 40.
Source: Office of CM N. Chandrababu Naidu pic.twitter.com/F6QqvQOdAg
— ANI (@ANI) January 9, 2025
కలెక్టర్, టీటీడీ EO పై అందరి ముందే ఫైర్ అయిన సీఎం
సీఎం: 2వేల మంది పట్టే చోట 2500 మందిని ఎందుకు అనుమతించారు?
EO: అందరు ఫ్రీ గానే కూర్చున్నారు సార్... వదిలేటప్పుడు కంట్రోల్‌గా వదలకపోవడం వల్లే ఇది జరిగింది..#TTD #Tirumala #ChandrababuNaidu pic.twitter.com/Wod1ESKw4B
— greatandhra (@greatandhranews) January 9, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)