IPL Auction 2025 Live

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి జగన్ సర్కారు నోటీసులు, గవర్నర్ కు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసుల్లో స్పష్టం

ఈ మేరకు ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది.

AP Government logo (Photo-Wikimedia Commons)

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఇటీవల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవడంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ మేరకు ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలంటూ ఈ షోకాజ్ నోటీసులో పేర్కొంది. గవర్నర్ కు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేశామని వెల్లడించింది. ఉద్యోగుల వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని తెలిపింది. ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు గవర్నర్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)