AP MLC Election Result 2023: 23 సీట్లని ఎద్దేవా చేశావు, అదే 23వ తేదీన అదే 23 ఓట్లతో నీ ఓటమి మా గెలుపు ప్రారంభం, ముఖ్యమంత్రి జగన్‌పై సెటైర్లు వేసిన నారా లోకేష్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుని సత్తా చాటింది. తగినంత బలం లేకపోయినా పంచుమర్తి అనురాధను చంద్రబాబు ఎన్నికల బరిలోకి దించారు. ఆయన వ్యూహాలు ఫలించి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ విజయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబసభ్యురాలు పంచుమర్తి అనూరాధ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై సెటైర్లు వేశారు. 'మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశావు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నావు. చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో నీ ఓటమి - మా గెలుపు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు' అని దెప్పిపొడిచారు.
Here's Nara Lokesh Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)