MLA Kona Raghupathi's Birthday: వీడియో ఇదిగో, బాపట్లలో పట్టపగలే రికార్డింగ్ డ్యాన్సులు, ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల్లో యువతులతో డ్యాన్సులు
వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల పేరుతో బాపట్లలో ఆ పార్టీ నేతలు బరితెగించారు. నడిరోడ్డుపై వేదిక నిర్మించి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. యువతులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డ్యాన్స్‌లు చేయించారు.
వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే కోన రఘుపతి జన్మదిన వేడుకల పేరుతో బాపట్లలో ఆ పార్టీ నేతలు బరితెగించారు. నడిరోడ్డుపై వేదిక నిర్మించి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. యువతులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు డ్యాన్స్‌లు చేయించారు. దీంతో స్థానికంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ మార్గంలో వెళ్లే వారంతా పట్టపగలే డాన్స్‌లు చేయడం చూసి ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకున్నారు.
ఇక శం జిల్లా దర్శి ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నాయకులు యువతులతో కలిసి రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గురువారం తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. బుధవారం అర్థరాత్రి దర్శిలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటుచేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)