Botsa Meet YS Jagan: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను అభినందించిన వైఎస్‌ జగన్‌, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేత

ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయాల్సి ఉండగా అంతకంటే ముందు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు.

Botsa Meet YS Jagan (photo/YSRCP X/Video grab)

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయాల్సి ఉండగా అంతకంటే ముందు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు. జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పలువురు ఉన్నారు. కాసేపట్లో మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు చాంబర్‌లో ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయనున్నారు.విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.  ఏపీలో హీటెక్కిన ఎగ్ పఫ్స్ అంశం, టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య వార్, ఎవరేమంటున్నారంటే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)