Andhra Pradesh: వైఎస్సార్ మీద పాట వస్తుంటే జగన్ ఏం చేశాడో చూడండి, ఉన్న‌ట్టుండి కుర్చీలో నుంచి లేచి పాట పాడిన వెంకాయమ్మ దగ్గరకు వెళ్లిన సీఎం

పాట‌ను కొన‌సాగించ‌డంతో ఉన్న‌ట్టుండి కుర్చీలో నుంచి లేచిన జ‌గ‌న్‌... ఒక్క ఉదుటున వెంకాయ‌మ్మ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆమెను త‌న రెండు చేతుల‌తో ప‌ట్టుకుని తీసుకొచ్చి, ఆమెకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. క్ష‌ణాల వ్య‌వధిలో జ‌రిగిన స‌న్నివేశం వైర‌ల్‌గా మారిపోయింది.

Buchepalli Venkayamma Singing Excellent Song on YSR Watch Video

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తిలో ప‌ర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చీమ‌కుర్తిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భా వేదిక‌పై సీఎం జ‌గ‌న్ వేదిక‌పై కూర్చుని ఉండ‌గా... ప్ర‌కాశం జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగుతున్న బూచేప‌ల్లి వెంకాయ‌మ్మ దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డిపై ఓ పాట అందుకున్నారు. జ‌గ‌న్ వారిస్తున్నా... ఆమె ఆ పాట‌ను కొన‌సాగించారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ సూచ‌న మేర‌కు వెంకాయమ్మ కుమారుడు, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద రెడ్డి ఆమె వ‌ద్ద‌కెళ్లి ఆమె పాట‌ను నిలిపే య‌త్నం చేశారు. అయినా కూడా ఆమె విన‌కుండా పాట‌ను కొన‌సాగించ‌డంతో ఉన్న‌ట్టుండి కుర్చీలో నుంచి లేచిన జ‌గ‌న్‌... ఒక్క ఉదుటున వెంకాయ‌మ్మ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆమెను త‌న రెండు చేతుల‌తో ప‌ట్టుకుని తీసుకొచ్చి, ఆమెకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. క్ష‌ణాల వ్య‌వధిలో జ‌రిగిన స‌న్నివేశం వైర‌ల్‌గా మారిపోయింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement