Skill Development Scam: వీడియో ఇదిగో, సిట్ అధికారుల ముందు చంద్రబాబు, కొన్ని పత్రాలపై సంతకాల కోసంమళ్లీ సిట్ కార్యాలయానికి చంద్రబాబు
శనివారం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచారు.
Vjy, Sep 10: శనివారం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్ కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచారు. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ భద్రత మధ్య విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించారు.శనివారం సాయంత్రం 5 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆదివారం తెల్లవారుజామునన 3 గంటల వరకూ అంటే సుమారు 10 గంటలపాటు సిట్ కార్యాలయంలోనే ఉన్నారు.
అక్కడ్నుంచి బయటకు వచ్చే సమయంలో చంద్రబాబు నీరసంగా కనిపించారు. కాగా, సిట్ కార్యాలయం నుంచి ఆస్పత్రికి చంద్రబాబును తీసుకెళుతున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశఆరు. అయితే, పోలీసులు వారిని చెదరగొట్టారు.
Here's Video
చంద్రబాబుకు వైద్య పరీక్షలు ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో పూర్తయ్యాయి. అందరూ ఆయన్ని కోర్టుకు హాజరు పరుస్తారని భావించారు. అయితే మళ్లీ చంద్రబాబు ను సిట్ కార్యాలయానికి తీసుకెళ్లాలని సిఐడి పేర్కొంది. మరి కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టాలని చంద్రబాబు ను సిట్ కార్యాలయానికి తరలించనున్నట్టు సమాచారం .
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)