CM Jagan: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు.. వర్షం కారణంగా హెలికాప్టర్‌ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మంగళవారం చేపట్టాల్సిన పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

YS jagan Mohan Reddy (Photo-AP CMO)

Vijayawada, Nov 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) నెల్లూరు (Nellore) జిల్లాలో మంగళవారం చేపట్టాల్సిన పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల (Rains) కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం పర్యటించాల్సి ఉంది. అయితే వర్షం ప్రభావంతో హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో సీఎం పర్యటనను రద్దు చేసినట్టు సమాచారం.

YS jagan Mohan Reddy (Photo-AP CMO)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now