Andhra Pradesh: ఒంటిమిట్ట కల్యాణోత్సవం, సంప్రదాయ పంచెకట్టులో పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఈ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ కొద్దిసేపటి కిందట ఒంటిమిట్ట చేరుకున్నారు. ఆయనకు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయపబద్ధంగా స్వాగతం పలికారు.
ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో నేడు శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ కొద్దిసేపటి కిందట ఒంటిమిట్ట చేరుకున్నారు. ఆయనకు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయపబద్ధంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీరాముడికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కోదండరాముని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ పంచెకట్టులో ఆలయ ప్రవేశం చేశారు. స్వామివారిని దర్శించుకున్న సీఎం జగన్, కల్యాణ వేదిక వద్దకు తరలివెళ్లనున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)