Covid in AP: ఏపీలో తాజాగా 4,228 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 842 కేసులు, 10 మంది మృతితో 7,321కి చేరుకున్న మరణాల సంఖ్య, ప్రస్తుతం 25,850 యాక్టివ్ కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 4 వేల మందికి కరోనా నిర్ధారణ అయింది. 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 842 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 622, తూర్పు గోదావరి జిల్లాలో 538, విశాఖ జిల్లాలో 414 కేసులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 48, కర్నూలు జిల్లాలో 88 కేసులు వెల్లడయ్యాయి.

corona vaccination launched by etela rajender in Hyderabad (Photo-Twitter)

అదే సమయంలో 1,483 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 9,32,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,99,721 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,850 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,321కి చేరింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement