Ambati Rayudu Joins YSRCP: వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు, అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్

ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడ్ని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు.

Ambati Rayudu Joins YSRCP (Photo-X)

ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడ్ని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. గత కొన్నినెలల వ్యవధిలో రాయుడు సీఎం జగన్ తో పలుమార్లు సమావేశమయ్యారు. ఎప్పుడు అడిగినా... సీఎంతో రాష్ట్రాభివృద్ధి అంశాలపై మాట్లాడానని రాయుడు చెప్పేవారు. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడంతో ఆ ప్రచారానికి తెరపడింది. కాగా, రాయుడు గుంటూరు నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతారని కూడా కథనాలు వచ్చాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Here's YSRCP Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now