Cyclone Remal Effect: వీడియోలు ఇవిగో, ఉప్పాడలో ఇంకా అల్లకల్లోలంగానే సముద్రం, ఇళ్లలోకి దూసుకువచ్చిన సముద్రపు నీరు

రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజుల నుంచి ఏపీలో కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి

Cyclone Remal Effect: turbulent sea off the Uppada coast of Kakinada district Watch Videos

రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. గత మూడు రోజుల నుంచి ఏపీలో కాకినాడ సమీపంలోని ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గం యూ. కొత్తపల్లి మండలం ఉప్పాడలో మూడో రోజు సముద్రం ఉగ్రరూపం దాల్చింది.  అర్థరాత్రి బెంగాల్ తీరాన్ని తాకిన రెమాల్ తుఫాన్, భారీ వర్షాలకు ఏడుగురు మృతి, అంధకారంలో 15 మిలియన్ల మంది ప్రజలు

దీని తాకిడికి మాయా పట్నంలో ఇళ్లలోకి సముద్రపునీరు వచ్చి చేరింది. ఇక సముద్రంలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడం, అలాగే సముద్రం ముందుకు రావడంతో మత్స్యకారులు బిక్కు బిక్కుమంటూ తీవ్ర భయాందోళన చెందుతున్నారు.ఈ పరిస్థితులు ఇలా ఉంటే నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం వాయుగుండంగా మారి తుపాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది.ప్రస్తుతం ఈ తుపాను ఈశాన్య దిశగా కదిలి.. ఇది పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్‌కు 380 కిలో మీటర్లు దూరంలోనూ అలానే బంగ్లాదేశ్‌కు నైరుతి దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కావడంతో.. ఈ ప్రభావం కారణంగానే ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది.

Here's Videos

►బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ముప్పు మన రాష్ట్రంలో లేనప్పటికీ,దీని ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

►అలలు పెద్ద ఎత్తున పడటంతో ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద్ తీర ప్రాంతాల్లోని ఇళ్లు, కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురయ్యాయి. pic.twitter.com/rKsdu7g1ln

కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే మార్గంలో సముద్రం ఉగ్రరూపం. pic.twitter.com/97arayiSDd

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now