Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆన్ లైన్ బెట్టింగులతో మోసపోయానంటూ పెన్షన్ డబ్బులతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్ సెల్ఫీ వీడియో, నెలరోజులలో డబ్బులు చెల్లిస్తాను అని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ప‌రిధిలోని స‌చివాల‌యం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ సంప‌త్ ల‌క్ష్మీ ప్రసాద్ పెన్షన‌ర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 ల‌క్షల‌ డ‌బ్బులతో ప‌రార‌యిన సంగతి విదితమే. తాజాగా అతను సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

Dachepalli Secretariat Welfare Assistant Lakshmi Prasad Released Selfie Video who absconded with pension money

ఆంధ్రప్రదేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీ ప‌రిధిలోని స‌చివాల‌యం-3లో వెల్ఫేర్ అసిస్టెంట్ సంప‌త్ ల‌క్ష్మీ ప్రసాద్ పెన్షన‌ర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 ల‌క్షల‌ డ‌బ్బులతో ప‌రార‌యిన సంగతి విదితమే. తాజాగా అతను సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తను ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో చాలా డబ్బులు పోగొట్టుకున్నానని దీనితో అప్పులయ్యాయని వెళ్లడించాడు. ప్రభుత్వ సొమ్మును వాడుకున్నందుకు తనను క్షమించాలని కోరిన లక్ష్మీ ప్రసాద్‌ నెలరోజుల్లో ఎలాగైన చేసి మొత్తం డబ్బులను చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. నా తల్లిదండ్రులను బతిమిలాడైనా డబ్బులు తీసుకొస్తానని తెలిపాడు.

వీడియో ఇదిగో, పెళ్లిలో డీజే గొడవలో చితకబాదుకున్న ఇరువర్గాలు, పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ

రెండు రోజులుగా తన భార్యపిల్లలు అన్నం కూడా తినలేదని, అప్పుల మూలంగా ఆత్మహత్య సైతం చేసుకోవాలనుకున్నామని వెల్లడించాడు. తనకు ఒక అవకాశం ఇస్తే మరోసారి ఇలాంటి తప్పు చేయనని కమిషనర్‌, కలెక్టర్‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. కాగా వీడితో లక్ష్మీప్రసాద్‌తో పాటు ఆయన భార్య పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. కాగా లక్ష్మీప్రసాద్‌ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Dachepalli Secretariat Welfare Assistant Lakshmi Prasad Released Selfie Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement