Andhra Pradesh: వీడియో ఇదిగో, నందిగామలో నడిరోడ్డుపై తన్నుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు, నలుగురికి గాయాలు, వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు
కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో వ్యక్తిగత గొడవల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.
ఏపీలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలో వ్యక్తిగత గొడవల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నడిరోడ్డుపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నాయకులు గాయపడినట్లు తెలుస్తుండగా.. వారి ఫిర్యాదు మేరకు వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఏడుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నామన్నారు. గొడవకు కారణమైన ఎంపీపీ మాలిక్ బషీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నడిరోడ్డుపై ఇరువర్గాల దాడుల కారణంగా స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Dispute between TDP and YCP leaders