Actress Syamala on AP Elections: వీడియో ఇదిగో, ఏపీ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపిన నటి శ్యామల, సోషల్ మీడియాలో ట్రోల్స్‌, బెదిరింపు కాల్స్‌పై ఆవేదన

actress Syamala (photo-Video Grab)

మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని వైఎస్ఆర్సీపీ నేత సినీ నటి శ్యామల అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం గెలిచిననాడు పొంగిపోలేదు ఓడిన నాడు కుంగిపోము మల్లి పుంజుకొని మా నాయకుడు జగన్ అన్న ఆధ్వర్యంలో తిరిగి లక్ష్యాన్ని సాధించడానికి రెట్టింపు పని చేస్తామని తెలిపారు.  వీడియోలు ఇవిగో, వైసీపీ నేతల ఇంటిపై కోడిగుడ్లు, రాళ్లతో టీడీపీ శ్రేణులు దాడులు, అడ్డువచ్చినా పోలీసు వాహనాలను సైతం..

ఈ సందర్భంగా ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వానికి టాలీవుడ్ యాంకర్ శ్యామల శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ప్రజలకు మరింత అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు వైఎస్సార్సీపీ అప్పగించిన పనిని నిర్వర్తించానని శ్యామల పేర్కొన్నారు. తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా జగనన్న వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. నాపై వస్తున్న ట్రోల్స్‌ను పట్టించుకోనని టాలీవుడ్ యాంకర్‌ శ్యామల వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)