Earth Tremors At Pulichinthala: పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూ ప్రకంపనలు.. భయంతో వణికిపోయిన ప్రజలు

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

Earthquake Representational Image- PTI

Palnadu, Feb 19: ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) పల్నాడు (Palnadu) జిల్లా పులిచింతల ప్రాజెక్టు (Pulichinthala Project) పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం ఏడున్నర గంటల సమయంలో అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి తదితర గ్రామాల్లో  కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. మళ్లీ భూ ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే అవి స్వల్ప ప్రకంపనలేనని, భయపడాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు.

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్.. హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు.. అరెస్ట్ ఎందుకంటే? (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now