File (Credits: Twitter/ANI)

Hyderabad, Feb 19: వైఎస్సార్ టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను (YS Sharmila) మహబూబాబాద్ (Mahabubabad) పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ కు (Hyderabad) తరలిస్తున్నారు. షర్మిలపై ఎస్సీ (SC), ఎస్టీ (ST) అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆమెను అరెస్ట్ చేశారు.

ఉపరితల ఆవర్తనంతో ఉత్తర కోస్తాలో వర్షం.. వచ్చే 24 గంటల్లో చెదురుమదురు వర్షాలు

అసలేం జరిగిందంటే... మహబూబాబాద్‌లో నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో