Andhra Pradesh: ఏపీలో దారుణం..రెండో తరగతి బాలికపై వృద్దుడి లైంగిక వేధింపులు, తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక..కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Elderly man Sexual Harassment on 2nd class Girl(X)

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా తాడిగడప కంటి ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్నాడు నారాయణ అనే వృద్ధుడు.

అదే ఇంటి సమీపంలో నివసిస్తున్న రెండో తరగతి బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కుక్కపిల్ల కోసం నారాయణ ఇంటి సమీపంలోకి వెళ్లిన బాలికపై నారాయణ అసభ్యంగా ప్రవర్తించాడు.

అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది బాలిక. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు పెనమలూరు పోలీసులు.  ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ మృతి

Elderly man Sexual Harassment on 2nd class Girl

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now