Fact Check: ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త పూర్తిగా అబద్దం, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండని తెలిపిన ఏపీ ఫ్యాక్ట్ చెక్
ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం జరగలేదు.
ఏలూరు జిల్లాలో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం జరగలేదు. ఉడకబెట్టిన గుడ్లను, కోడి మాంసాన్ని తినొచ్చు. ఉంగుటూరు మండలం, బాదంపూడిలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలడంతో 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించాం. వైరస్ సోకిన కోళ్లను, గుడ్లను పూడ్చిపెట్టడం జరిగింది.
కొన్ని రోజులు పాటు చికెన్ తినవద్దు, హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
అలాగే ఆయా కోళ్ళ ఫారాల నుంచి కిలోమీటర్ పరిధిని ఇన్ఫెక్షన్ జోన్ గా ప్రకటించి రెడ్ అలెర్ట్ జారీ చేసాం. బర్డ్ ఫ్లూ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి అని తెలిపింది. కాగా ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్‌కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.
ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త పూర్తిగా అబద్దం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)