![](https://test1.latestly.com/wp-content/uploads/2024/03/Birdflu.jpg?width=380&height=214)
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మంగళవారం రాష్ట్ర పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు కొన్ని రోజుల వరకు చికెన్ తినొద్దని హెచ్చరించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సర్కార్ సూచించింది. ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వ్యాపించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అని భోపాల్‌లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తేల్చింది.
పలు గ్రామాల్లో చనిపోయిన కోళ్లకు హెచ్5ఎన్1 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో… చికెన్ తినొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ పశు సంవర్ధక శాఖ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ సహా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో చికెన్‌పై ఆంక్షలు విధించారు. ప్రజలకు చికెన్ తినవద్దని సూచిస్తున్నారు.
Telangana government warns Avoid eating chicken
ALERT..
కొన్ని రోజులు చికెన్ తినవద్దు.. తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన తెలంగాణ ప్రభుత్వం
ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీలకు వ్యాపించినట్లు సమాచారం.#ViralNews #Trending pic.twitter.com/VQWzX8MGJ4
— Telangana Awaaz (@telanganaawaaz) February 11, 2025
ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సైతం కోళ్లు ఫ్లూ కారణంగా మరణిస్తున్నట్టు తేలింది. ఇప్పటికే శాంపిల్స్ సేకరించిన అధికారులు కోళ్ల మరణానికి ఫ్లూ కారణమని తేల్చారు.