Accident In Kakinada: ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు లారీలు.. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి.. నలుగురు సజీవ దహనం.. కాకినాడలో ఘటన

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.

Credits: Video Grab

Kakinada, Dec 2: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని కాకినాడ (Kakinada) జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు (Patthipadu) మండలం ధర్మవరం (Dharmavaram) సమీపంలో జాతీయ రహదారిపై రెండు లారీలు (Two Trucks) ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొట్టుకోవడంతో ఒక్కసారిగా పెద్దయెత్తున  మంటలు (Fire) చెలరేగాయి. దీంతో క్యాబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకర్ని ఆసుప్రతికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నలుగురు మరణించగా.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రెప్పపాటులో పెద్ద గండం నుంచి తప్పించుకున్న నాలుగేండ్ల బాలిక.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now