Geethanjali Suicide Case: గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌, పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతా వారి కోసం వెతుకులాట

పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడు అంటూ వార్తలు వస్తున్నాయి.

One Person Arrest by Police Who is Trolling Social Media on Tenali Woman (Photo/X/Telugu Scribe)

సోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌ జరిగింది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడు అంటూ వార్తలు వస్తున్నాయి. గీతాంజలిపై రాంబాబు సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని తెనాలి స్టేషన్‌కు తరలించారు. గీతాంజలి మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్య, ఎవరిని వదిలిపెట్టేది లేదని వెల్లడి

Here's News