GV Reddy Resigns: టీడీపీతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా, ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడి

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.

GV Reddy Resigns as AP FiberNet Chairman and TDP Primary Membership

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు. లేఖలో వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవులకు రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసం.. అందించిన మద్దతుతో పాటు కీలక బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

టీడీపీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదు’’ అని జీవీరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈవివాదం నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

GV Reddy Resigns as AP FiberNet Chairman and TDP Primary Membership

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement